#raitunestham #terracegarden #rythunesthamawards
నగరాలలో, పట్టణాల్లో ఇంటిపంటపై ఆసక్తి పెరుగుతోంది. వ్యవసాయంతో ఎలాంటి సంబంధం లేనివారు కూడా ఇంటిపంటను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించవచ్చు. ఇంటి పంట వలన శారీరక శ్రమ లభించటంతోపాటు ఎలాంటి విష రసాయన అవశేషాలు లేని కూరగాయలు మరియు ఆకుకూరలు ప్రతినిత్యం తినటానికి అవకాశం కుదురుతుంది.
కొంచెం శ్రద్ధ పెట్టగలిగితే కొన్నిరకాల పండ్లను కూడా ఇంటిపంటలో పెంచుకోవచ్చు కాబట్టి సేంద్రియ పండ్లను తినడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. వీటిన్నింటికి తోడు ఇంటి పంట వల్ల మానసిక ఉల్లాసం అందుబాటులోకి వస్తుంది. ఇన్నిరకాల ప్రయోజనాలున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటిపంటవైపు అడుగులు వేయాలని, ఇంటి పంటే మన ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని ఈ రోజు (31 డిసెంబర్) హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టిసిసిఐ భవన్‌లోని సురానా ఆడిటోరియంలో రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ‘తుమ్మేటి రఘోత్తమరెడ్డి రైతునేస్తం మిద్దెతోట పురస్కారాలు’ ప్రదానోత్సవ కార్యక్రమంలో నాబార్డ్ తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీమతి చింతల సుశీల అన్నారు.
ఈ కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ మరియు డైరెక్టర్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ ప్రొఫెసర్ అడపా కిరణ్ కుమార్, ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌లు విజయప్రసాద్ మరియు బాబు, మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి, ప్రముఖ రచయిత డా. పుల్లూరి సంపత్ కుమార్ మరియు రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ వై. వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితానికి, ఎలాంటి రసాయన అవశేషాలు లేని కూరగాయలు మరియు ఆకుకూరలకు, శారీరక శ్రమకు, మానసిక ఉల్లాసానికి సరైన పరిష్కారం ఇంటిపంట లేదా మిద్దెతోటే అని ప్రముఖులు వివరించారు. నగరాల్లో, పట్టణాల్లో మిద్దెతోట సంస్కృతి వేగంగా విస్తరిస్తుంది. కొత్తవారిని ఇంటిపంటవైపు ఆసక్తి పెరిగేలా చేయాలనే ఉద్దేశంతో మిద్దెతోట అవార్డులను రఘోత్తమరెడ్డిగారి పేరుమీద గత సంవత్సరం ప్రారంభించటం జరిగింది. అనేకమంది తోటివారి ప్రేరణ పొంది ఇంటిపంటవైపు అడుగులు వేస్తున్నారు.
మిద్దెతోట అవార్డు గ్రహీతలు మరింత ఉత్సాహంతో మరిన్ని లోగిళ్ళకు ఇంటిపంటను పరిచయం చేయవలసిన బాధ్యత స్వీకరించి రాబోవు రోజుల్లో ఎక్కువమంది ఇంటిపంటను సాగు చేస్తూ పల్లెల నుంచి పట్టణాలకు కాకుండా పట్టణాల నుంచి పల్లెలకు కూరగాయలు మరియు ఆకుకూరలు సరఫరా చేసే స్థాయికి ఎదగాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు.
————————————–
☛ Subscribe for latest Videos – https://youtu.be/HiO4PSbGPek
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/…
☛ Follow us on – https://www.facebook.com/Rytunestham…
☛ Follow us on – https://twitter.com/rytunestham
————————————-
Terrace Gardening Awards 2022
Tummeti Raghotham Reddy – Raitunestham – Middetota Awards 2022
plants gardeners
Hyderabad terrace garden
Organic Kitchen Garden
Perati Thota
Terrace Gardener
Terrace Garden
Roof Garden
Organic terrace garden
organic terrace garden
Natural Farming
Terrace Gardeners
Roof Gardeners
Inti Panta
Midde Thota
Home Crops
container gardening
hydroponics terrace garden
cocopeat terrace garden
Micro Greens in Kitchen
Micro Greens in home
wheat grass in home
Music Attributes :
www.bensound.com
5 Comments
sir please come and
give sabcdi material to
AP
రైతునేస్తం ఛైర్మెన్ పద్మశ్రీ యడవల్లి వెంకటేశ్వరరావు గారి కి,తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారికి..వారు మిద్దె తోటల అభివృద్ధి కోసం చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేస్తూ, మాలాంటి వాళ్ళను ప్రోత్సాహిస్తూ ..మమ్మల్ని సత్కరించినందుకు కృతజ్ఞతలు..🙏🙏🙏
Manchi program chupinchavu
🙏🙏🙏🙏🙏🙏
Correctga select chesaru. Andariki abhinamdanalu. Award graheethalanu nenu vyakthigathanga kalavaka poyina YouTube, Facebook dwara naaku patichaysme. 🙏🙏🙏🙏🙏🪔