నీళ్ళల్లో, మట్టిలో (కుండీలు) శాస్విత లత #plants #share #shorts #garden #tips #yt #tranding తమలపాకు గుండె ఆకారంలో ఉంటే శాశ్వతలత. అపారమైన ప్రయోజనాలు ఎందుకంటే తమలపాకులో ఫైబర్ ఆంటి ఆక్సిడెంట్లు విటమిన్లు మినరల్స్ అధికంగా ఉంటాయి. ఈ మొక్కను మనం నీళ్లలో పెంచుకోవచ్చు, చక్కగా మట్టిలో( కుండీల్లో) కూడా అందంగా పెంచుకోవచ్చు. ఇంట్లో లేదా పెరట్లో కుండీల్లో తమలపాకు మొక్కలు పెట్టుకోవడం ప్రతిరోజు ఒక తమలపాకు నమలడం ఆరోగ్యానికి చాలా మంచిది. కొద్దిపాటి కాంతిలో, నీడలో మొక్క గొప్పగా పెరుగుతుంది. రసం గా పేస్ట్ గా కషాయంగా నమలడం ద్వారా తమలపాకు చాలా అంటే చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. తమలపాకు నమ్మడం వల్ల లాలాజలం ఉత్పత్తి మెరుగుపడుతుంది. మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చునని ఆయుర్వేద వైద్యం చెబుతుంది. రాత్రంతా ఆకులను నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగడం పేగు కదలికలు చక్కగా ఉంటాయి. పేగు ఆరోగ్యం బాగుంటుంది. అధికంగా భోజనం చేసిన పిదప తమలపాకులను నమిలితే, అలవోకగా తిన్నది అరిగిపోతుంది. అటువంటి తమలపాకు మొక్కలు చక్కగా మీ ఇంట చేర్చుకోవాలని చిన్న ఆశ.

7 Comments

Write A Comment

Pin